కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు.

ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మ‌రోవైపు ప‌లువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. కాగా, యాద‌గిరి రెడ్డి అంత్యక్రియలు ఈ రోజే స్వగ్రామంలో జరగనున్నాయి.

Share post:

Latest