ఫ్లైట్ లో తమన్నాతో కోహ్లీనా..?

ఈ మధ్య కాలంలో వెండితెర మీద రాణిస్తుంది నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌ అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తమన్నా చేతిలో బిస్కెట్లు, చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకుని ఉంది. వెనక కూర్చున్న ఇద్దరూ వాటినే చూస్తున్నారు. ఈ పిక్ లో చెంపకు చేయానించుకుని తన బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్న వ్యక్తి విరాట్‌ కోహ్లి అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయటం మొదలు పెట్టారు.

విరాట్‌ అక్కడెందుకున్నాడని అందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానికి సమాధానంగా అక్కడ ఉంది టీమిండియా కెప్టెన్‌ కాదు అంటూ క్లారిటీ ఇస్తూ వారి పేర్లను ట్యాగ్‌ చేసింది. దీని ప్రకారం హెయిర్‌ డ్రెస్సర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే తనతో ఉన్నారని క్యాప్షన్‌లో చెప్పింది తమన్నా. తమన్నా ముంబై నుంచి హైదరాబాద్‌కు చార్టెడ్‌ ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు తీసిన ఈ పిక్ మొత్తానికి నెట్టింట ఫుల్ హల్చల్ అయింది.

Share post:

Latest