గుంటూరులో మూడు కాళ్లతో వింత శిశువు.. అరుదైన సర్జరీ..!

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. బాబుకు మూడుకాళ్లు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జన్యుపరమైన లోపాలతో ఇలాంటి శిశువులు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు. తాజాగా జన్మించిన శిశువుకు మూడో కాలు వీపుభాగం నుంచి బయటకు పొచుచుకువచ్చినట్లుగా ఉంది.

మరోవైపు శిశువుకు వచ్చిన అదనపు కాలును తొలగించాలని తల్లిదండ్రులు డాక్టర్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. మూడో కాలు వెన్నుముకకు దగ్గర్లోనే ఉండటం ఆపరేషన్ చేసి తీసేయడం సాధ్యం కాకపోవచ్చని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మార్చి 31 న న్యూరో విభాగం వైద్యులు శేషాద్రిశేఖర్‌, హనుమ శ్రీనివాసరెడ్డి శిశువుకు అరుదైన సర్జరీ చేసి మూడో కాలును విజయవంతంగా తొలగించారు.

Share post:

Latest