వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో..!!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండియన్ యూట్యూబర్ అయిన ఆశిష్ స్కూటర్ ను నడుపుతుంటాడు. రోడ్డు పై అతనికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను తిప్పేస్తాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ చివరికి ఆశిష్ స్కూటర్ ను ఆపి అతన్ని లైసెన్స్ , ఆర్‌సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్.

ఆ తరువాత ట్రాఫిక్ పోలీస్ హాల్ టికెట్, పాన్ కార్డ్, సిబిఎస్ఇ ప్రశ్నపత్రం, 10వ తరగతి మార్క్స్ షీట్, కరెంట్ బిల్ వంటికి కూడా అడుగుతాడు. ఆశ్చర్యకరంగా ఆశిష్ దగ్గర అన్నీ ఉంటాయి. దీంతో విసుగెత్తిన ట్రాఫిక్ పోలీస్ మరి నన్ను చూసి ఎందుకు పరిగెత్తావు అని ఆశిష్ ను అడుగుతాడు. దానికి ఆశిష్ ఏడుపుతో ఛార్జర్ భూల్ గయా థా సాబ్ ఘర్ పె, ఫోన్ మెయిన్ ఛార్జింగ్ నహీ హై ఇస్లీయే జా రాహా థా.. అంటే సర్, నేను ఇంట్లో ఛార్జర్‌ను మరచిపోయాను. నా ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నేను తిరిగి వెళ్తున్నాను అంటూ చెప్తాడు. ఈ ఫన్నీ ట్విస్ట్ భలే బాగుంది కదా. స్మృతి ఇరానీ ఈ వీడియోను షేర్ చేసిన వెనీటనే కొన్ని గంటలోనే బాగా వైరల్ అయ్యింది.

Share post:

Latest