పొలిటికల్‌ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్‌. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ ‌లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం అంటూ ఉండే టాగ్ ‌లైన్‌ చూస్తే, ఆమె పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ లీడర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పై పోరాటం చేసే పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ కనిపించనున్నాడని టాలీవుడ్‌లో సినీ వర్గాల టాక్‌. ఈ చిత్రంలో సాయితేజ్‌ సరసన ఐశ్యర్య రాజేశ్‌ నటించనుంది. నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జీ స్టూడియో పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Share post:

Latest