ట్రక్‌ నడిపి షాక్‌ ఇచ్చిన నటి..?

కొత్త చాలెంజ్‌అంటే చాలు ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఒకరు. ఇప్పుడు ఈ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చిందంటే హిందీ సినిమా సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌ కోసం రకుల్‌ ఓ హెవీ ట్రక్‌ను నడిపి, మూవీ యూనిట్‌ లో అందరికి పెద్ద షాక్‌ ఇచ్చారట. ఈ విషయం గురించి రకుల్‌ మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్‌ను నడపడం అంత ఈజీ కాదు.

మొదట కొంచెం టెన్షన్ పడినా ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో బాగా నడపగలిగాను. నా డ్రైవింగ్‌ స్కిల్స్‌ చూసి మూవీ యూనిట్‌ సభ్యులు అంతా షాక్‌ అయ్యారు. ట్రక్‌ నడపడం అనేది నా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అని ఆమె అన్నారు. అర్జున్‌కపూర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మేలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది.

Share post:

Popular