మనమంతా ఆ విషయంలో విఫలం అయ్యాము అంటున్న టాలీవుడ్ హీరోయిన్..!?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అతి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో యాక్టర్స్ అందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ రోజు కూలీలు, సినిమా మీద ఆధారపడి జీవించే సినీ కార్మికుల గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ వేస్తుంది. నా గుండె బరువెక్కుతోందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భావోద్వేగానికి లోనైయింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో షూటింగులు క్యాన్సిల్‌ అయ్యి వాయిదా ఒడ్డాయి. గత ఏడాది కరోనా నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఏంత్తో బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకోవడంలో సమాజంగా అందరం చాలా విఫలమయ్యాం అంటూ రకుల్ చెప్పింది. లాక్ డౌన్ ను, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే పరిస్థితి మరలా మొదటికి వస్తుందని రకుల్ చెప్పుకొచ్చింది.

Share post:

Popular