రాధే ట్రైల‌ర్ రిలీజ్..!

 

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ సినిమా అంటే చాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్షన్స్ కురిపిస్తాయి. ఆయ‌న తాజా చిత్రం రాధే కోసం ఆయన అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఈద్ కానుక‌గా ఒకేసారి ఇటు థియేట‌ర్ అటు ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయ‌గా, ఇది అభిమానుల‌కు బాగా నచ్చేసింది.

రాధే ట్రైల‌ర్‌లో స‌ల్మాన్ మార్క్ యాక్ష‌న్, డాలా‌గ్స్‌తో పాటు కామెడీ స‌న్నివేశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు బ‌న్నీ, దేవి శ్రీప్ర‌సాద్, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన డీజే చిత్రంలోని సీటీమార్ అనే ట్రాక్ కూడా ఈ మూవీలో వినిపించింది. ముంబైలో పెరుగుతున్న క్రైమ్ ని అరికట్టడానికి వచ్చే స్పెషల్ ఆఫీసర్ గా సల్మాన్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్‌ ని ఓ లుక్కేయండి.

 

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/zPl7y5yBzuo” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Share post:

Latest