మన్‌కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన సూచనలు ఇస్తున్నారు. అయితే కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలు తప్పుడు ప్రచారాలును నమ్మవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులందరూ ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సిన్ ను వేసుకోవాలని సూచించారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.

Share post:

Latest