అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం జో బైడెన్‌ ప్రణాళికలు..!

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునః నిర్మించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు మొదలు పెట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌ కింద దేశంలో 20 వేల మైళ్ల పొడవైన రోడ్లు, 10 వేల వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తన ప్రణాళికలలో తెలిపింది. వీటి ద్వారా దేశంలో పెద్ద సంఖ్య ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇది అమెరికా ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.

- Advertisement -

జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ దీనికి అమెరికన్ జాబ్స్ ప్లాన్ అని పేరు పెట్టారు. దీనికింద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వైట్ హౌస్ అధికారులు చెప్పారు. పరిశోధన, అభివృద్ధి కోసం ,రోడ్లు, వంతెనల కోసం, ప్రజా రవాణాకు, ఆమ్ట్రాక్, ఫ్రైట్ రైలుకు , ఓడరేవులు, విమానాశ్రయాలకు, బ్రాడ్‌బ్యాండ్ కోసం, నీటి మౌలిక సదుపాయాల కోసం ఆ మొత్తని ఖర్చు చేయనున్నారు. సీసం పైపుల నుంచి నీరు సరఫరా జరుగకుండా కొత్త పైపుల ఏర్పాటుకు 45 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు వారి ప్రాజెక్టులో పేర్కొన్నారు.

Share post:

Popular