రెండో సారి కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఆర్ఎక్స్ 100 భామ..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెల‌బ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గ‌త సంవత్సరం క‌రోనా వ‌ల‌న తొమ్మిది నెల‌ల పాటు షూటింగ్స్ లో పాల్గొన‌లేక‌పోవ‌డంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్ష‌లు చేయించుకుంటున్నారు.

తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న త‌దుప‌రి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంది.ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతక ముందు చేయించుకున్న క‌రోనా ప‌రీక్ష‌లో పాయ‌ల్‌కు నెగెటివ్ రాగా, ఇప్పుడు ఇంకా రిజ‌ల్ట్ రాలేదని త‌న పోస్ట్ ద్వారా తెలిపింది. అయితే ప్ర‌స్తుతం పాయ‌ల్ ఖాతాలో పెద్ద‌గా చిత్రాలు ఏమి లేకపోయినా, పాయల్ ఇప్పుడు ఏ సినిమా సెట్‌లో అడుగు పెట్టేందుకు పరీక్ష చేయించుకుంద‌ని నెటిజన్స్ అంటున్నారు.

Share post:

Latest