ఆస్కార్ 2021 అవార్డు గ్రహీతలు వీరే ..!

ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నో మ్యాడ్‌లాండ్‌ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్‌ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు.

విజేతలు ఇలా ఉన్నారు. ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెలుపొందిన క్లోవీ చావ్‌, ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ ల్యాండ్‌, ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ నో మ్యాండ్‌ ల్యాండ్‌, ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్‌, ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌, ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా, ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌, ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌, ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్, ఉత్తమ అడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌, ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌, ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌.