నిధి అగ‌ర్వాల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ద‌గ్గుబాటి హీరోతో..?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో న‌టించి.. మ‌రింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి.

- Advertisement -

దీంతో ప్ర‌స్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా న‌టించే అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను కొట్టేసింది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నిధికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. దుగ్గుబాటి వారి అబ్బాయి రానా కొత్త ప్రాజెక్ట్‌లో నిధిని హీరోయిన్‌గా తీసుకున్నార‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

Share post:

Popular