నాగార్జున ’వైల్డ్ డాగ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

కింగ్ నాగార్జున ఇటీవ‌ల `వైల్డ్ డాగ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అహిషోర్ సోలొమన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలి రేజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఘోరంగా డిజాస్ట‌ర్ అయింది. మౌత్ టాక్ బాగున్న‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం దారుణంగా వ‌చ్చాయి.

వైల్డ్ డాగ్’ చిత్రానికి రూ. 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 10 కోట్ల షేర్ రావాల్సిందే. కానీ, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.53 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో రూ.6.47 కోట్లు న‌ష్టం వాటిల్లింది. ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్క‌లు ఇలా ఉన్నాయి.

నైజాం-రూ. 1.21 రూ కోట్లు
సీడెడ్ – రూ. 43 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 44 లక్షలు
ఈస్ట్ గోదావరి – రూ. 24 లక్షలు
వెస్ట్ గోదావరి – రూ. 17 లక్షలు
గుంటూరు – రూ. 22 లక్షలు
కృష్ణా – రూ. 23 లక్షలు
నెల్లూరు – రూ. 14 లక్షలు
——————————————–
ఏపీ + తెలంగాణ- రూ. 3.08 కోట్లు
——————————————–

రెస్ట్ ఆఫ్ ఇండియా-రూ. 15 లక్షలు
ఓవర్సీస్- రూ. 30 లక్షలు
వరల్డ్ వైడ్ (టోటల్)- 3.53 కోట్లు