వైరల్: కమర్షియల్ యాడ్ లో సమంత, చైతు..!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ లవింగ్ కపుల్ లో ఒక్కరు సమంత, నాగ చైతన్య. 2010లో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిలి వంటి చిత్రాల్లో ఈ జంట కలిసి నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్య తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు ఇద్దరు. దానిలో భాగంగా దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్వై చేస్తున్నాయి.

హైదరాబాద్ లో ఓ కమర్షియల్ యాడ్ షూట్ లో దిగిన కొన్ని ఫోటోలను, వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. అందులో సమంత, చైతన్య లుక్స్ చాలా బాగున్నాయి. సమంత వెండి, గులాబీ రంగులో ఉన్న పట్టు చీర, టెంపుల్ జ్యూవలరీ వేసుకుంది. నాగ చైతన్య లేత నీలం రంగు సూట్ ధరించాడు. ఈ స్టిల్స్ ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest