బ్రేకింగ్ : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం..!?

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖ పట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్‌లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నటుండి మంటలు వ్యాపించినట్లు అక్కడ యాజమాన్యం వారు చెప్పారు.

వెంటనే ఇది తెలుసుకుని అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగనందు వల్ల అక్కడివారు కాస్త ఊపిరి పిల్చుకుంటున్నారు. అయితే ఆస్తి నష్టం ఏమేరకు జరిగిందనే విషయం పై ఎటువంటి సమాచారం ఇంకా అందలేదు.

Share post:

Latest