ఈసీ కి కీలక సూచనలు ఇచ్చిన మమతా..!?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రి పూట కర్ఫ్య ఇంకా వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ నిర్వహించడానికి సిద్ధం అయినా సంగతి తెలిసిందే.  ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి అయ్యాయి. కానీ ఇలాంటి క్రమంలో మిగిలిన నాలుగు దశల్లో పోలింగ్ ఒకేసారి.ఒక విడతలో పూర్తి చేయాలని సోషల్ మీడియా సాక్షిగా ఎన్నికల కమిషన్ ని మమతా బెనర్జీ కోరారు. రాష్ట్రంలో కేసులు ఎక్కువ అవుతున్న క్రమంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని వారు సూచించారు.