ప్రిన్స్ మహేశ్ బాబు‌ నిర్మాతగా మరో ప్రాజెక్ట్..?

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మాత గా మరో ‌ ప్రాజెక్ట్‌ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు‌ హీరోగా మేజర్ సినిమాని నిర్మి​స్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరో నవిన్‌ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి ఎంటర్టై‌న్‌మెంట్‌తో ప్లాన్‌ చేస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే చర్చలు జరుగినట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఇకపోతే, పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సినీ వర్గాల టాక్. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు మూవీతోనే ‌ నిర్మాతగా మారారు. కానీ మేజర్ మూవీ‌తో పూర్తి నిర్మాతగా మారారు. ఈ చిత్రాన్ని సోనీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. ఆయన స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని జూలై 2వ తేదీన రిలీజ్ చేసేలా ప్లాన్‌ చేసారు మేకర్స్.

Share post:

Latest