రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే, మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రంలో ఫరియాకి అవకాశం వచ్చినట్లు సమాచారం. కాగా మంచి మూవీస్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలని, సైకో లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ తన డ్రీమ్ రోల్ అని హైదరాబాద్ తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా ఇదివరకే చెప్పింది. కాబట్టి రానున్న రోజులో మరిన్ని మూవీస్ లో నటించి అందరిని మెప్పించనుంది ఫరియా.

Share post:

Latest