శ్రుతిహాస‌న్‌కు రెగ్యుల‌ర్‌గా క‌రోనా టెస్టులు..కార‌ణం అదేన‌ట‌!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న శ్రుతి.. మ‌ళ్లీ `క్రాక్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

ఇక ప్రస్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తున్న శ్రుతిహాస‌న్‌.. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్‌లో పెట్టింది. ఇదిలా ఉంటే.. శ్రుతి హాస‌న్ రెగ్యుల‌ర్‌గా క‌రోనా టెస్టులు చేయించుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతినే తెలియ‌జేసింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రుతి.. క‌రోనా పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

తాను ఎక్కువగా షూటింగ్స్ నిమిత్తం ప్రయాణాలు చెయ్యాలస్సి ఉంటుంది. అందుకే తాను ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ ను నిర్లక్యం చెయ్యడం లేదని.. ముఖ్యంగా తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగ కూడదని రెగ్యులర్ గా కరోనా టెస్టులు చేయించుకుంటూ ఉంటానని శ్రుతి తెలిపింది.

Share post:

Popular