ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా `గల్లీ రౌడీ` టీజ‌ర్..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజా చిత్రం `గ‌ల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుద‌ల చేశారు. `బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అంటూ పోసాని కృష్ణ మురళీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది.

హీరోయిన్‌తో కలిసి హీరో ఓ వ్యక్తిని చేసే కిడ్నాప్ నేపథ్యంలో కథ సాగుతుంద‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థమ‌వుతోంది. `ఎవరైనా మనవడిని డాక్టర్ చేస్తాడు.. లేదా ఇంజనీర్ చేస్తాడు.. మరీ డబ్బుంటే ఎంఎల్‌ఏని చేస్తాడు.. ఈ రౌడీని చేయడం ఏంటీ రా` అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. మరి ఆ అంచ‌నాల‌ను సందీప్ అందుకుంటాడో లేదో చూడాలి.

Share post:

Latest