హాస్పిట‌ల్‌లో ఆశా కార్య‌క‌ర్త రాస‌లీలు.. చివ‌ర‌కు..

వైద్య‌సిబ్బంది అంటే దైవంగా స‌మానంగా కొలుస్తారు ప్ర‌జ‌లు. క‌రోనా వేళ అనేక మంది క్షేత్ర‌స్థాయి సిబ్బంది ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వైర‌స్ నియంత్ర‌ణ‌కు కృషి చేశారు. ఫ్రంట్ వారియ‌ర్లుగా గుర్తింపు పొందారు. అనేక మంది ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌ను పొందారు. వృత్తి నిబ‌ద్ధ‌తతో సామాన్యుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. కానీ ఓ ఆశ‌కార్య‌క‌ర్త మాత్రం ఆ వృత్తికే క‌ళంకం తీసుకొచ్చింది. వైద్య‌శాల‌లోనే రాస‌లీల‌కు తెగ‌బ‌డింది. ఆ విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఉద్యోగం నుంచి తీసేశారు అధికారులు. వివ‌రాల్లోకి వెళ్లితే..

క‌ర్నాట‌క రాష్ట్రం విజయపుర జిల్లా ఇండి తాలూకా తాంబ్రా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ ఆశా కార్య‌క‌ర్త కొన్ని సంవ‌త్స‌రాలుగా విధులు నిర్వహిస్తున్న‌ది. ఆమెకు ఆ గ్రామ పంచాయ‌తీ స‌భ్యుడితో అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది. వారిద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల వైద్య‌శాల‌లోనే రాస‌లీల‌ను కొన‌సాగించారు. ఆ తతంగ‌మంతా హాస్పిట‌ల్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ‌యింది. ఆ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యం జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజ్‌కుమార్ దృష్టికి వెళ్ల‌డంతో స‌ద‌రు ఆశా కార్యకర్తను సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు ఉదంతంపై విచారణ జరుగుతున్న సమయంలో ఆశ‌కార్య‌క‌ర్త రాస‌లీల వీడియో బయటకు రావడం గ‌మ‌నార్హం.

Share post:

Latest