బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

 

 

సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు టెస్టులు నిర్వహించగా అందులో పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం ఆయన తన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలోని డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది అని తెలుస్తోంది.

Share post:

Latest