నెగెటివ్ వచ్చినా క‌రోనా చికిత్స‌ చేయాల్సిందే..కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

ప్ర‌స్తుతం మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సద్దుమణిగిందనుకున్న కరోనా మళ్ళీ సెకెండ వేవ్ రూపంలో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇలాంటి త‌రుణంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

టెస్టు‌ ఫలితాలతో పనిలేదని.. లక్షణాలుంటే వెంటనే కరోనా చికిత్స చేయలని కేంద్రం వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. లేదంటే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫ‌లితాలు వ‌చ్చేందుకు కూడా మూడు, నాలుగు రోజులు ప‌డుతోంది. ఈలోపు రోగి ఆరోగ్యం మ‌రింత క్షీణిస్తుంది.

అందుకే ఇక‌పై కరోనా నెగెటివ్ వచ్చినా.. లక్షణాలుంటే ఆస్పత్రిలో చేర్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే చాలు… కరోనా టెస్ట్‌ ఫలితాల కోసం వేచిచూడకుండా వెంట‌నే చికిత్సను ప్రారంభించాలని కేంద్రం సూచించింది.

Share post:

Latest