సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌..!?‌

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సందీప్‌ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఫ్రాంక్‌ ఆంథోనీ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్‌’ సినిమా కోసమే. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమాలోని శేష్, సయీల క్యారెక్టర్‌ పోస్టర్ ‌ను విడుదల చేశారు. అలాగే ‘మేజర్‌’ టీజర్‌ ను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘‘శౌర్యం, ధైర్యానికి పేరుగాంచిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ వీరమరణం పొందిన ఘటనలను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇతర సంఘటనలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మహేశ్‌బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్‌’ సినిమా జూలై 2న విడుదల కానుంది.

Share post:

Latest