మ‌రోసారి మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన ప్ర‌గ‌తి..వీడియో వైర‌ల్‌!

న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్ర‌గ‌తి.

ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానుల‌ను అల‌రిస్తూ ఉంటుంది.

అయితే ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే సందర్భంగా తాజాగా ప్ర‌గ‌తి ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోల‌తో డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు త‌న ఫ్రెండ్‌తో క‌లిసి మాస్ స్టెప్పులు వేసి అదర‌గోట్టింది ప్ర‌గ‌తి. ఫాస్ట్ మూమెంట్స్‌కి తోడు ఇద్దరి గ్లామర్ డోస్ ఈ వీడియోకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/COP2UEijQ92/?utm_source=ig_web_copy_link

Share post:

Latest