అచ్చం బేబమ్మలాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!!

బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా ఉప్పెన‌. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. తొలి చిత్రం అయినా కూడా చాలా ప‌రిణితితో న‌టించింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా త‌ర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది కృతి శెట్టి. ప్ర‌స్తుతం చాలా ఆఫర్స్ చేతిలో ఉండటంతో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి ఇప్పుడు తాజాగా వార్త‌ల‌లో నిలిచింది.

కృతీశెట్టి అలియాస్‌ బేబమ్మను పోలిన ఒక నటి పిక్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమెను చూసినవారంతా కృతి శెట్టి అని భ్ర‌మ‌ ప‌డుతున్నారు. అచ్చం కృతి శెట్టి డూప్‌లో ఉన్న ఈ న‌టి పేరు విద్య విను మోహ‌న్. త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన ఈ భామ ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళ సీరియ‌ల్స్ నటిస్తుంది.

Share post:

Popular