35 సార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్న హీరోయిన్ ఎవరంటే..?

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలు పెట్టినప్పుడు నుండి అందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం మొదలు పెట్టారు. అలా కరోనా టెస్ట్‌ చేయించుకున్న వారిలో నటి నిధీ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఈ సంగతి గురించి నిధీ మాట్లాడుతూ, ఫస్ట్‌ టైమ్‌ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నప్పుడు నాకు చాలాభయం ఇంకా అసౌకర్యంగా అనిపించింది.

కానీ ఆ తర్వాత కరోనా టెస్ట్‌ కి ఇప్పుడు బాగా అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి మూవీ షూటింగ్స్‌లో నేను పాల్గొంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న మూవీస్ కోసం నేను తరచూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల మధ్య తిరుగుతూ చాలా బిజీగా ఉంటున్నాను. నేను జర్నీ చేసి వచ్చిన ప్రతిసారీ కూడా కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి దాదాపు 35 సార్లు నేను కరోనా టెస్ట్‌ చేయించుకున్నాను అని ఆమె అన్నారు.

Share post:

Popular