నాగార్జున‌ను టార్గెట్ చేసిన రామోజీరావు

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుల కాంబినేష‌నలో తెర‌కెక్కుతున్న భ‌క్తిర‌స చిత్రం న‌మో వేంక‌టేశాయ‌. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామికి అత్యంత ప్రియ భ‌క్తుడు హ‌థీరాం బాబా జీవితాన్ని ఆధారంగా తీసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తొలి లుక్‌కి మంచి కామెంట్లు ప‌డ్డాయి. దీంతో ఈమూవీపై అంద‌రిలోనూ మంచి అంచ‌నాలే ఉన్నాయి. అన్న‌మ‌య్య హిట్‌ను ఈ మూవీ బ్రేక్ చేస్తుంద‌ని కూడా టాక్‌. ప్ర‌స్తుతం స‌గానికి పైగా మూవీ షూటింగ్ పూర్త‌యింద‌ని స‌మాచారం.

ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించిన హాట్ టాపిక్ ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. న‌మో వేంక‌టేశాయ మూవీ శాటిలైట్ హ‌క్కుల్ని ఈటీవీ సొంతం చేసుకుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అది కూడా రూ. 4 కోట్ల కు ఈ టీవీ ద‌క్కించుకుంద‌ట‌. వాస్త‌వానికి శాటిలైట్ హ‌క్కుల కోసం ఈటీవీ పెద్ద ఎత్తున ఏమీ పోటీకి దిగ‌దు. జెమినీ, మా, జీ వంటి ఛానెళ్లే.. శాటిలైట్ హ‌క్కుల కోసం ఓ రేంజ్‌లో పోటీ ప‌డ‌తాయి. అలాంటిది  ఇప్పుడు ఈటీవీ న‌మో వేంక‌టేశాయ‌కి పోటీకి దిగ‌డ‌మే కాకుండా.. నాలుగు కోట్ల‌కు ద‌క్కించుకోవ‌డ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

గ‌తంలో నాగ్‌-రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అన్న‌మ‌య్య ను ఈటీవీ సొంతం చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున ఈ ఛానెల్ గ‌డించింద‌నే టాక్ ఉంది. దీంతో ఆ రేంజ్‌లోనే న‌మో వేంక‌టేశాయ కూడా హిట్ట‌వుతుంద‌ని ముందుగానే ఈటీవీ అంచ‌నా వేసింద‌ని తెలుస్తోంది. న‌మో వేంక‌టేశాయ శాటిలైట్ హ‌క్కుల‌కు గ‌ట్టి పోటీ ఎదురైనా.. ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావే స్వ‌యంగా ఈ మూవీని ఈటీవీకి ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం.

అందుకే  ఓం న‌మో వేంక‌టేశాయ ఈటీవీ ప‌ర‌మైందని తెలుస్తోంది. ఇక రామోజీ కూడా మ‌ళ్లీ సినిమాల శాటిలైట్స్ హ‌క్కులు సొంతం చేసేకునే ప్ర‌క్రియ‌ను నాగార్జున సినిమా నుంచే స్టార్ట్ చేయ‌డంపై కూడా ప‌లు చ‌ర్చ‌లకు తావిస్తోంది. ఇక‌పై ఆయ‌న త‌న ఈటీవీ సినిమా ఛానెల్ కోసం అయినా కొత్త సినిమాల హ‌క్కులు సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగుతార‌ని కూడా కొంద‌రు అంటున్నారు.