ఆ మంత్రి డైలాగ్‌తో జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదా..!

ఏపీ విప‌క్ష నేత, వైకాపా అధినేత జ‌గ‌న్‌కి నిద్ర‌లేని రాత్రులు  కొత్త‌కాదు! ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం!! ఒక్కాసారి మీ క‌ళ్లు మూసుకుని గ‌తంలోకి వెళ్లిపోతే.. జ‌గ‌న్‌కి చేతికి అందివ‌చ్చి.. ఇక ఒక‌టో రెండో రోజుల్లో సీఎంగా ప్ర‌మాణం చేసేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన మ‌రుస‌టి రోజే రోశ‌య్య రూపంలో కాంగ్రెస్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. దీంతో అప్ప‌ట్లోనే ఆయ‌నకు నిద్ర ప‌ట్ట‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత సీఎం సీటు ద‌క్కుతుంద‌ని 2014 ఎన్నిక‌ల్లో తెగ ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, అనుకున్న‌దొక్క‌టి అయింది ఒక్క‌టి అన్న‌ట్లు మారిపోయింది ప‌రిస్థితి. దీంతో ఆయ‌న ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయ్యారు. దీంతో అప్పుడు కూడా జ‌గ‌న్‌కి నిద్ర ప‌ట్ట‌లేదు.

ఇక, ఇటీవ‌ల టీడీపీ ఆక‌ర్ష్ దెబ్బ‌కి వైకాపా నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు క్యూక‌ట్టుకుని మ‌రీ సైకిల్ ఎక్కేశారు. దీంతో టీడీపీ నుంచి త‌న పార్టీలోకి వ‌స్తార‌ని భావించిన ఎమ్మెల్యేలు యూట‌ర్న్‌గా త‌న పార్టీ నుంచి బాబు పంచ‌న చేర‌డంతో జ‌గ‌న్ షాక్‌కి గుర‌య్యారు. ఇదిలావుంటే, తాజాగా ఏపీ మంత్రి అచ్చ‌న్నాయుడు మ‌రో షాకింగ్ న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లోనే వైకాపా ఎంపీలు వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని, అవి అయిపోయే లోపునే ఎంపీలు చంద్రబాబు చెంత‌కు చేర‌తార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ ప‌రిస్థితి జ‌గ‌న్‌కి మ‌రో పెద్ద షాక్‌గా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు! ఇప్ప‌టికే 2014 ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే రెండో రోజు నంద్యాల నుంచి గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా జంప్ చేయాల‌ని చూసినా.. ప్యాకేజీ కుద‌ర‌క ఆగిపోయింద‌ని టాక్ న‌డిచింది.

ఇక‌, కొత్త ప‌ల్లి గీత ప‌రిస్థితి మ‌రింత దారుణం ఆమె వైకాపాలోనే ఉన్నా అధ్య‌క్షుడిపై తిట్టుకుమ్మ‌రించారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు మంత్రి అచ్చెన్న ప్ర‌క‌ట‌న జ‌గ‌న్‌కి మ‌రింత షాక్ ఇచ్చేలా త‌యారైంది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. అచ్చెన్న చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌తో జ‌గ‌న్‌కు మ‌ళ్లీ డిఫెన్స్‌లో ప‌డిన‌ట్టు ఏపీ వైకాపాలోనే చ‌ర్చ‌లు విన‌వ‌స్తున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూడాలి.