మ‌రో త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

మ‌హేష్‌బాబుకు ఇటీవ‌ల త‌మిళ డైరెక్ట‌ర్ల‌పై బాగా మ‌క్కువ పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలోనే ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న మ‌హేష్ మ‌రో కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడా ? అంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అవున‌నే అంటున్నాయి. మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాత‌గా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో మ‌హేష్ న‌టిస్తాడు. ఈ సినిమాలో మ‌హేష్ సీఎం రోల్‌లో క‌నిపిస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక కొర‌టాల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ త‌మిళ్ డైరెక్ట‌ర్‌తోనే ప‌ని చేయ‌నున్నాడ‌ట‌. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను మహేశ్ బాబు హీరోగా ద్విభాషా చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్‌లో క‌బాలి వంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాను నిర్మించిన ఆయ‌న మ‌హేష్‌తో ద్విభాషా సినిమా నిర్మించ‌నున్నార‌ట‌. ‘రాజా రాణి’, విజయ్ ‘పోలీస్’ సినిమాల ఫేం అట్లీ సహాయ దర్శకుడు బాస్కో ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. బాస్కో మ‌హేష్‌ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేసిన లైన్ అదిరిపోయేలా ఉంద‌ట‌.

ప్ర‌స్తుతం మురుగ‌దాస్ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఉన్న మ‌హేష్‌ను బాస్కో-థాను క‌లిసి ఈ సినిమా స్టోరీ లైన్ వినిపించ‌గా మ‌హేష్ సైతం బాగుంద‌ని మెచ్చుకున్నాడ‌ట‌. ఇక థెరీ షూటింగ్ టైంలో బాస్కో మీద థానుకు మంచి గురి ఏర్ప‌డింద‌ట‌. ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్ అట్లీ కూడా ప్ర‌స్తావిస్తూ థాను గారు నిర్మాత‌గా త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా ఉంటుంద‌ని కూడా చెప్ప‌డంతో ఈ సినిమా ఉంటుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.