టి.కాంగ్రెస్‌కి ఉండవల్లి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు గురించి, ఆ సమయంలో పార్లమెంటులో జరిగిన సంఘటలన గురించి పుస్తకం రాసి తెలుగు ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. దాంతో టి.కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. తెలంగాణ తెచ్చింది తామేనని పుస్తక రూపంలో చెప్పుకోడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఉండవల్లి పుస్తకం రాయగా లేనిది తామెందుకు వెనుకబడి ఉన్నామో వారికి అర్థం కావడంలేదు. ముఖ్యంగా జైపాల్‌ రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడూ ఆ ప్రయత్నం చేయకపోవడం శోచనీయం.

 నిజానికి ఆయనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఉండవల్లి కూడా విభజన చట్టం పాస్‌ అవడంలో జైపాల్‌రెడ్డి వ్యూహాత్మక ధోరణిని ప్రస్తావించారు. ఆయన చెప్పినా చెప్పకున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర చాలా ఎక్కువ. అయిన్పటికీ ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు ఆయన బలంగా చెప్పుకోలేకపోయారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. పుస్తకం రాసి, ప్రజల్లోకి తెచ్చుకోగలిగి ఉంటే చరిత్రలో జైపాల్‌రెడ్డి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేది. ఇప్పటికైనా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని జైపాల్‌రెడ్డి పుస్తకం రాస్తారేమో చూడాలిక.