అందుకే కీర్తి వెరీ వెరీ స్పెషల్‌.

హీరోయిన్‌గా హిట్‌ వచ్చినంతమాత్రాన వెంటనే ఏదో ఒక సినిమా ఒప్పేసుకోవాలనుకోదామె. అందుకే ఆమె వెరీ వెరీ స్పెషల్‌ అయ్యింది. చాలా సెలక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటూ కెరీర్‌ పట్ల ఖచ్చితమైన అవగాహనతో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె ఎవరో కాదు ‘నేను శైలజ’ ఫేం కీర్తి సురేష్‌. తమిళంలో, తెలుగులో హీరోయిన్‌గా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ నటించిన ‘రైల్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, గ్లామర్‌ వంటి విషయాల్లో కొంచెం మొహమాటం కారణంగా ఆ అవకాశాల్ని వదులుకుంటోంది కీర్తి సురేష్‌. నటనతోనే హీరోయిన్‌గా రాణించాలనుకుంటున్నాననీ గ్లామర్‌ విషయంలో తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేరని కీర్తి సురేష్‌ నిర్మొహమాటంగా చెబుతోంది.

తమిళంలో విజయ్‌ హీరోగా రూపొందుతోన్న ఓ చిత్రంలో తాజాగా హీరోయిన్‌గా ఎంపికైంది ఈ భామ. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే ఈ భామ తనకంటూ కొన్ని షరతులు విధించేసుకుంది. ఆ షరతులు వర్తిస్తేనే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంతే ఖచ్చితంగా చెప్పేసింది. అదే దారిలో నడుస్తోంది. అందుకు ఆమెకు హ్యాట్సాప్‌ చెప్పక తప్పదు. తనకు భాషతో సంబంధం లేదు. ఇక్కడా అక్కడా ఎక్కడైనా ఓకే నటించడానికి. కానీ తనకి నచ్చితేనే ఆ పాత్రలో నటిస్తాను అంటోంది. ఏది ఏమైనా తన వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోనని ముద్దు ముద్దుగా చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.