‘శ్రీరస్తు శుభమస్తు’ శాటిలైట్ ఎంతో తెలుసా?

అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రం లాభాలు రాబడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. జెమినీ టీవీ రూ.3 కోట్లు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకుంది.

ఈ మొత్తంతో సినిమా సగం బడ్జెట్ కవరైపోయింది. విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తుండటం,కుటుంబ ప్రేక్షకులు సైతం సినిమాను ఆదరిస్తుండటంతో జెమినీ టీవీ ఇంత భారీ మొత్తాన్ని ఇచ్చుకుంది. శిరీష్ , లావణ్య త్రిపాఠిల నటన, తమన్ సంగీతం, పరశురామ్ కథ-కథనాలే ఈ సినిమా ఇంతటి విజయాన్ని కట్టబెట్టాయి.