రెజినా బికినీ గ్లామర్‌.

అందాల భామ రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందన్న సంగతి తెలిసిందే. ‘ఆంఖేన్‌-2’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ హిందీలో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘ఆంఖేన్‌-2’ సినిమా కోసం బికినీ గ్లామర్‌ చూపించనుందట రెజీనా. దీని కోసం ఓ ఫొటోసెషన్‌ చేయనున్నారని సమాచారమ్‌. ముందుగా ఈ సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి ఇలియానా నో చెప్పిందనే రూమర్స్‌ వచ్చాయి. ఆ కారణంతోనే ఆ తరువాత రెజినాని తీసుకున్నారు. కానీ ఇలియానాకి కూడా ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇద్దామనుకున్నారట. దాంతో ఇలియానాకి కోపమొచ్చింది. నానా యాగీ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రూమర్సే అని తేల్చి చెప్పింది.

వాటిలో తన ప్రమేయం లేదని వారించింది. దీంతో ఈ విషయంపై పెద్ద రగడే నడిచింది. ఇక రెజినా విషయానికి వస్తే బాలీవుడ్‌లో దక్కిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అందుకోసం గ్లామర్‌లో హద్దులు దాటెయ్యడానికైనా రెడీయేనట రెజీనా. ఎలాగూ నటనలో అమ్మడికి స్పెషల్‌ టాలెంట్‌ ఉండనే ఉంది. సో యాక్టింగ్‌ ఎలాగూ ఇరగదీసేస్తుంది. ఇక గ్లామర్‌ విషయానికొస్తే రెజీనాకి ఏమాత్రం హద్దులు లేవు కూడా. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాలో.