మహేష్‌ మరో వంద కోట్ల సినిమా

బ్రహ్మూెత్సవం’ సినిమా పరాజయం మహేష్‌ని చాలా కలిచి వేసింది. దాంతో మహేష్‌ మహా స్పీడయ్యాడు. వరుసపెట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అవి కూడా భారీ సినిమాలే. ఒకటి మురుగదాస్‌ డైరెక్షన్‌లో సినిమా అయితే, తాజాగా వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసి ప్రేక్షకుల్ని ఫుల్‌ ఖుషీ చేయాలని డిసైడ్‌ అయ్యాడట ప్రిన్స్‌ మహేష్‌బాబు.

మురుగదాస్‌తో సినిమా ఆల్రెడీ సెట్స్‌ మీద ఉంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఇకపోతే వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడట వంశీ. అంతేకాదు ఈ సినిమాకు పీవీపీ సంస్థ నిర్మాణ బాధ్యతల్ని తీసుకోనుంది. ఈ సంస్థ డిఫరెంట్‌ స్టోరీస్‌ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంలో దిట్ట.

అలాగే మహేష్‌ సినిమా కోసం పీవీపీ సంస్థ సుమారు వంద కోట్ల బడ్జెట్‌ని ప్లాన్‌ చేస్తోందట. ఈ సినిమాతో మహేష్‌ ‘శ్రీమంతుడు’లాంటి బారీ విజయాన్ని అందుకోవడం పక్కా అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మరో వైపు మహేష్‌ కొరటాల కాంబినేషన్‌లో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా సెట్స్‌ మీదికెళ్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు పూరీ, మహేష్‌ కాంబినేషన్‌ కూడా లైన్‌లో ఉంది. సో వరుస సినిమాలతో మహేష్‌ సూపర్‌ బిజీ అన్న మాట.