మంత్రి భార్యనీ వదల్లేదు

ఆమె స్వయానా కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ భార్య భారతీ సింగ్‌.అయితేనేం ఆమెనే బెదిరిస్తున్నాడో ప్రబుద్దుడు.వివరాల్లోకెళ్తే ఢిల్లీకి చెందిన ప్రదీప్‌ చౌహాన్ మంత్రి గారి కుటుంబానికి తెలిసినవాడే.ఆ మధ్య ఆగష్టు 6 న భారతి సింగ్ ప్రదీప్ తో ఫోన్ లో మాట్లాడింది.అయితే ఆ మాటలని ప్రదీప్ రహస్యంగా రికార్డు చేసాడని రూ 2 కోట్లు ఇవ్వకపోతే ఆ సంభాషణల్ని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా ప్రదీప్ దగ్గర లైసెన్స్‌డ్ రివాల్వర్ ఉందని,తద్వారా తన కుటుంబానికి హాని చేస్తానని ప్రదీప్ బెదిరిస్తున్నాడని భారతి పేర్కొంది.అతడి తో మాట్లాడిన మాట వాస్తవం అయితే అతడు ఆ ఆడియో ని మార్ఫింగ్ చేసి ఇప్పుడు బయట పెడతా అంటున్నాడు..నిజంగా అందులో ఏముందో తనకు తెలీదంతోంది భారతి.

అసలు ఆడియో బయటికొస్తే కానీ ఎవరి బండారా ఏంటో బయటపడదు.అందులో ఏమి లేక పోతే మంత్రి గారి భార్య ఇంతగా ఉలిక్కి పడటమేంటో అర్థం కావడం లేదు.నిజంగా ఆడియో మార్ఫింగ్ చేసి ఉంటే మాత్రం నిందితుడి బెండు తీయడం ఖాయం.ఒక వేళ మార్ఫింగ్ చేయకపోయినా బెరించాడు కాబట్టి అప్పుడూ బెండు తీయడం మాత్రం పక్కా, కాకా పోతే ఇక్కడ మంత్రి గారి భార్య నిర్దోషిత్వం కూడా బయటపడుతుంది.