భూమా బ్యాండ్ బజాయించాడు

నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డి కోపం తో ఊగిపోయాడు.ఇదేదో ఫ్యాక్షన్ గొడవ కాదు.నంద్యాల చుట్టుపక్కల గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల టౌన్ లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.రోడ్లన్నీ జలమయం అయ్యాయి.మునిసిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప సహాయక చర్యలు కానీ మరమ్మత్తులు కానీ చేపట్టిన పాపాన పోలేదు.

విషయం తెలుసుకున్న భూమా మునిసిపల్ అధికారుల్ని కొట్టినంత పని చేశారు.ఆగ్రహం తో ఊగిపోయారు.ఎం చేస్తున్నారు మీరు?ఫండ్స్ అన్ని ఎం చేస్తన్నారు..నంద్యాలను నాశనం చేస్తున్నారు మీరంతా అంటూ కోపోద్రిక్తుడైపోయారు.పక్కనే కొంతమంది యువకులు స్వచ్ఛందంగా వరద మల్లింపు కార్యక్రమాలు చేపడుతోంటే ప్రభుత్వం ఎం చేస్తోందంటూ అధికారులపై ఫైర్ అయ్యారు భూమా.

భూమా అంతగా అరుస్తున్నా అధికారులు కనీసం మాట మాట్లాడని లేదు.తల వంచుకుని రాతి విగ్రహాల్లా నిలబడ్డారు తప్ప వారి దగ్గర సమాధానం లేదు.భూమా చర్యను స్థానికులు మెచ్చుకుంటున్నారు.కనీసం ఇప్పటికైనా అధికారుల్లో చలనం వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు .ఎప్పుడూ రాజకీయాలు,ఫ్యాక్షన్..పార్టీ,వర్గ పోరు, అని వార్తల్లో నిలిచే భూమా ఇలా ప్రజా సమస్యలపై గొంతెత్తడం తో అన్ని వర్గాలనుండి భూమాపై ప్రశంసలు దక్కుతున్నాయి.