గిన్నిస్ కెక్కిన మోడీ సూటు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు మోడీ ధరించిన సూట్ గుర్తుంది కదూ. అప్పట్లో అంత ఖరీదైన సూటు ధరించడంపై మోదీపై విపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. ఇప్పుడు ఆ సూటు ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా ఈ రికార్డును మోదీ సూట్ దక్కించుకుంది.

2015 ఫిబ్రవరి 20న దీన్ని వేలానికి ఉంచగా గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్‌లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ అత్యధిక బిడ్ వేసి దీన్ని సొతం చేసుకున్నారు. ఈ సూటు రూ.4.31 కోట్లు పలికింది. బేస్ ప్రైజ్ 11 లక్షలు కాగా, అత్యధిక బిడ్ వేసి దానిని సొంతం చేసుకున్న లాల్జీబాయ్….వేలంలో రూ.5 కోట్లు దాటినా దానిని దక్కించుకుతీరాలని నిర్ణయించుకున్నట్టు నవ్వుతూ చెప్పారు.