ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు

ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్‌ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ స్టార్‌ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్‌ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్‌ లైన్‌ మార్చినట్లు సమాచారం.

ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్‌ సూపర్‌స్టార్‌. తమ స్టార్‌ హీరోని మెయిన్‌ హీరోగా చూసేందుకే అక్కడ ఫ్యాన్స్‌ ఇష్టపడతారు. అందుకని కన్నడలో క్లైమాక్స్‌ సీన్స్‌లో ఎన్టీఆర్‌ని పక్కన పెట్టి, మోహన్‌లాల్‌కి ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూపించారట. అంతేకాదు టీజర్‌లో కూడా తెలుగు వెర్షన్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌లో ఎన్టీఆర్‌ వాయిస్‌ వినిపిస్తే, కన్నడ వెర్షన్‌కి మోహన్‌లాల్‌ వెర్షన్‌ వినిపిస్తోంది. ఇలాగే సినిమాలో అక్కడి స్టార్‌ డమ్‌ని, ఇక్కడ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశారని ఊహిస్తున్నారు.

అయితే సినిమా విడుదలయ్యే వరకూ ఇది వాస్తవమా? గాసిప్‌ అనేది సస్పెన్సే. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు, మలయాళంలోనూ ‘జనతా గ్యారేజ్‌’పై భారీ అంచనాలున్నాయి.