వెంకటేష్ ‘రాధ’ డైరెక్టర్ అతనే

వెంకటేష్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తోనే మారుతి ఇంకో సినిమా చేయనున్నాడని సమాచారమ్‌. ‘బాబు బంగారం’ చేస్తున్నప్పుడే ఆ సినిమా గురించి కూడా చర్చలు ఓకే అయినట్లుగా తెలియవస్తోంది. అయితే ఇది ‘బాబు బంగారం’ కన్నా ముందు అనుకున్న కథ. ‘రాధ’ పేరుతో సినిమాని మారుతి అనౌన్స్‌ చేశాడు వెంకటేస్‌ హీరోగా. కొన్ని కారణాలతో అది ఆగింది. ‘బాబు బంగారం’తో శాటిస్‌ఫై అయిన వెంకటేష్‌, ‘రాధ’ సినిమానీ చేద్దామని చెప్పాడట. ‘బాబు బంగారం’లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

‘రాధ’ సినిమాలో వెంకటేష్‌ పొలిటికల్‌ లీడర్‌లా కనిపిస్తాడు. ఈ సినిమాలో వెంకటేష్‌ ఇద్దరు హీరోయిన్లతో నటించనున్నాడట. సీనియర్‌ హీరోయిన్‌తో పాటు మరో కొత్త హీరోయిన్‌ కూడా పరిచయం కానుందట ఈ సినిమా ద్వారా. గతంలో ఈ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు సంబంధించిన ప్రముఖ పొలిటికల్‌ లీడర్స్‌ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని అనుకున్నారు అప్పట్లో. కానీ ఆ స్టోరీకి కొన్ని మార్పులు జోడించి, పర్‌ఫెక్ట్‌ పొలిటికల్‌ లీడర్‌లా వెంకటేష్‌ని చూపించడానికి మారుతి సంసిద్ధంగా ఉన్నాడని సమాచారమ్‌. ఇప్పుడు పోలీస్‌, తర్వాత పొలిటీషియన్‌. వావ్‌ వెంకటేష్‌ యు ఆర్‌ అదుర్స్‌.