రెజీనాతో పార్టీకి టికెట్స్ ఇవిగో

రెజీనా కాసాండ్రా..కుర్రకారు ఈ పేరు వింటే చాలు వెర్రెత్తిపోతారు.అంతగా కుర్ర హృదయాల్ని కొల్లగొట్టింది ఈ అమ్మడు.తన అందం,అభినయంతో తో హీరోయిన్ గా బాగానే దూసుకుపోతోంది ఈ చిన్నది.అయితే అందం తో పాటు రెజినాకు అందమైన మనసుకూడా ఉందని నిరూపిస్తోంది ఈ బ్యూటీ .

పేద విద్యార్థుల కోసం సన్‌డౌన్‌ పూల్‌ పార్టీ విత్ రేజీనా కాసాండ్రా అనే ఓ పార్టీ ని ఏర్పాటు చేసింది.దీనికి సంబంధించి టికెట్స్ ని ఆన్లైన్ లో విక్రిస్తున్నారు.ఇందులో మొదటి 10 టికెట్స్ పొందిన వారు రెజీనాతో కలిసి కూర్చునే అవకాశం రానుంది.ఇది అభిమానులకి నిజంగా శుభ వార్తే.

అయినా వచ్చామా 10-15 సినిమాలు చేశామా డబ్బు మూటగట్టుకున్నామా మన దారిన మనం వెళ్లిపోదామా అన్నట్టు ఉంటుంటాను ఇవ్వాళ రేపు హీరోయిన్స్.అలాంటిది రెజీనా చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందించాల్సిందే.వెల్డన్ రెజీనా.ఆల్ ది బెస్ట్.