రచ్చ రచ్చ చేస్తోన్న రకుల్

ప్రస్తుతం టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిగర్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు రకుల్ ప్రీత్ దే.అంతటి అందం ఈ అమ్మడి సొంతం .హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ కొట్టేస్తూ రకుల్ దూసుకు పోతోంది.కెరీర్ బిగినింగ్ లో చిన్న హీరోలతో వరుస హిట్స్ కొట్టిన రకుల్ ఆ తరువాత పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అయినా నిర్మాతలు..హీరోలు ఈ ముద్దుగుమ్మ కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న రకుల్, మహేష్ బాబు- మురుగదాస్ భారీ ప్రాజెక్ట్‌లోను ఛాన్స్ కొట్టేసింది.ఇవే కాక బోయపాటి- బెల్లంకొండ శ్రీను చిత్రం, గోపిచంద్ మలినేని- సాయిధరమ్ చిత్రం, విశాల్ హీరోగా తెరకెక్కే తమిళ చిత్రంతో ఈ అందాల భామ అలరించనుంది.

అయితే తాజాగా సౌత్ స్కోప్ మేగజైన్ కోసం హాట్‌గా ఫోటో షూట్‌లో పాల్గొంది రకుల్.ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌ లో రకుల్ అందాల ఆరబోత ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయిపొయింది.రకుల్ అందాలు కుర్రకారుని మత్తెక్కించేస్తోంది.అప్పుడెప్పుడో మిస్ ఇండియా పోటీలకు గాను బికినీ ధరించిన రకుల్ మళ్ళీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం చేయని రకుల్ తాజా మేగజైన్ షూట్ తో అభిమానులకి పండగే మరి.