మోడీ చెయ్యిదాటిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం నరేంద్రమోడీ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది. రాజ్యసభలో తమ సభ్యుడి ద్వారా ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టించిన కాంగ్రెసు పార్టీ, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలనే కసితో ఉంది. కాంగ్రెసు వ్యూహాల్ని పసిగట్టడంలో బిజెపి విఫలమయ్యిందని నరేంద్రమోడీ, పార్టీ వేదికపై ముఖ్య నేతలకు క్లాస్‌ తీసుకున్నారట.

రైల్వే జోన్‌ అంశంపై స్పష్టతను ఇవ్వడం, ప్రత్యేక ప్యాకేజీపై కొంతమేర ప్రకటన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని నరేంద్రమోడీ భావిస్తున్నారని సమాచారమ్‌. ఇప్పుడు వాటిపై ఏమాత్రం క్లారిటీ ఇచ్చినాసరే అది కాంగ్రెస్‌ సాధించిన విషయాల కేటగిరీలోకే వెళ్ళిపోతుంది. కాంగ్రెసు ఒత్తిడికి దిగివచ్చినట్లే వుతుందని నరేంద్రమోడీ ఓ అంచనాకి వచ్చారు. ఈ పార్లమెంటు సెషన్‌ ముగిసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని నరేంద్రమోడీ అనుకున్నారట.

అలాగే తమ పార్టీకి చెందిన సభ్యుల ద్వారానే ఒత్తిడి తెప్పించుకుని మిగతా అంశాలపైన కూడా వివాలని నరేంద్రమోడీ అనుకున్నారని ఇది పసిగట్టిన కాంగ్రెసు పార్టీ, తమ డిమాండు కారణంగానే మోడీ నుంచి ప్రకటన వచ్చిందని చెప్పుకునేందుకు ఈ ప్రైవేటు బిల్లు తతంగాన్ని సీరియస్‌ చేస్తోందని కమలనాథులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ పరిస్థితి నరేంద్రమోడీ చెయ్యిదాటిపోయింది. ఇస్తే క్రెడిట్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి, ఇవ్వకపోతే నష్టం తమ ఖాతాలోకి అన్న భావనతో మోడీ దిగాలు పడ్డారట.