కొడుకు ముందే బంగారు బాబుని చంపేశారు

బంగారు బాబు గుర్తున్నాడా?1.27 కోట్ల రూపాయల విలువ చేసే 22 క్యారెట్లు , 3.5 కిలోల బరువు గల చొక్కాను ధరించి గతంలో వార్తల్లోకి ఎక్కాడు ఈ బాబు.బంగారం చొక్కాతో వార్తల్లోకెక్కిన బంగారు బాబు అలియాస్ గోల్డ్‌మన్ దత్తాత్రేయ పుగే ఈ రోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు బంగారు బాబుని పదునైన ఆయుధాలతో దాడి చేసి,రాళ్లతో కొట్టి చంపేసినట్టు తెలుస్తోంది.ఈ హత్య బంగారు బాబు అల్లుడే చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతనితో పాటు మరో నలుగురిని ఈ హత్యకేసులో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

బంగారు బాబు పుగే వక్రతుండ చిట్‌ఫండ్ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నాడు.అతనిపై అనేక ఆరోపణలున్నాయి.పలువురి నుంచి డబ్బులు సేకరించి అక్రమాలకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.గత రాత్రికొంతమంది తన భర్తను తీసుకు వెళ్లారని పుగే భార్య సీమ చెప్తోంది.అయితే బంగారు బాబుని కుమారుడి ఎదుటే దుండగులు దారుంగా హత్యచేశారని పాలీసులు తెలిపారు.ఆర్థిక లావాదేవీలేయ్ ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.