ప్చ్! శ్రద్ధ దాస్‌కు అదీ కలిసిరాలేదు

అన్నీ ఉన్నe కొందరికి లక్‌ ఉండదు. కెరీర్ ఊపందుకోడానికి అదే పెద్ద సమస్య అవుతూ ఉంటుంది. శ్రద్ధా దాస్ పరిస్థితి ఇలానే ఉందిప్పుడు. యాక్టింగ్ – ఎక్స్ పోజింగ్ ల్లో అమ్మడు లోటు చేయదు. అయినా సరే.. ఈ ముద్దుగుమ్మకు టైమ్ మాత్రం కలిసిరావడంలేదు. ఇటీవలే విడుదలైన
గ్రేట్ గ్రాండ్ మస్తీపై ఈ భామ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ అది గ్రేట్ డిజాస్టర్ గా మారిపోయింది. ఆ సినిమా ముందే లీకవ్వడం ఒక సమస్య అయితే.. కథ కూడా గొప్పగా లేకపోవడం మరో కారణం.

గ్రేట్ గ్రాండ్ మస్తీకి ముందు వచ్చిన రెండు భాగాలు హిట్ ఖాతాలో చేరాయి. ఆ ఆశతోనే శ్రద్ధ ఈ సినిమా విడుదలయ్యే టైమ్‌కు విడుదలయ్యేలా ఓ ఫొటో షూట్ చేసింది. పాత తరం హీరోయిన్లను తలపించే గెటప్ తో.. ఓల్డ్ మోడల్ ఫోన్ మాట్లాడుతున్న మోడ్రన్ వయ్యారిగా కనిపించి. ఫొటోలు బాగానే వచ్చినా.. సినిమా ఫెయిలవడంతో శ్రద్ధ అంచనాలు తారుమారయ్యాయి. ఈ చిత్రంతో అవకాశాలు వస్తాయనుకున్న అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.