నాని కొత్త సినిమా రెడీ

వైవిధ్య స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఈ క్రమంలో ఆయన విరించి వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో డైరక్టర్‌గా విరించి సత్తా చాటాడు.

ప్రస్తుతం ఆయన సినిమా చేస్తోన్న నాని, త్రినాథరావు చెప్పిన కథకి కూడా ఓకే చెప్పేశాడు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చనున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్రినాథరావు సిద్ధం చేసిన కథ వైవిధ్యంగా ఉండడంతోనే వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన నట-సాంకేతిక వర్గాల వివరాలను ప్రకటించనున్నారు.