కేశినేనికి కర్ణుడి శాపాలు

నవ్యాంధ్ర రాజధానిలో దేవాలయాలు కూల్చివేతల ఘటన అనేకరకాలుగా మలుపులు తిరుగుతుంది.దాదాపు 45 హిందు దేవాలయాలను కూల్చివేతపై హిందు మతసంస్దలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి.అయితే ప్రభుత్వంకంటే కేశినేని, బుద్దా వెంకన్నలు చంద్రబాబు దృష్టి వీరిపై మరల్చుకోవటానికి అతి చేస్తున్నారని, హిందు సాంప్రదాయాలను గౌరవిం చకపోతే రానున్నకాలంలో కేశినేని నానికి టిక్కెట్ కూడా రాదని, ఒకవేళ వచ్చినా వచ్చే ఎన్నికల్లో అతను తప్పక ఓటమి చెందుతాడని నిండు సభసాక్షిగా శివ స్వామి శాపనార్ధాలు పెట్టారు.

వాస్తవంగా భారతదేశ సాంప్రదాయంలో ప్రతి రాయికి, చెట్టుకు, పుట్టకు మొక్కుతారు. భగవంతుడు అనంత స్వరూపం కలవాడని, ప్రతి వస్తువులోను దైవం ఉంటుందనేది హిందు వుల నమ్మకం. అలాంటిది అభివృద్దిపేరిట దేవాలయాలను కూల్చివేయటంపై స్వాములు ఫైర్ అవుతున్నారు. అదే విధంగా కేశినేని నాని కూడా స్వామిజీలను విమర్శించేసరికి కేశినేనికి కర్ణుడి శాపాలు తగిలే అవకాశం ఉందా అనే అనుమానం ప్రజల్లో కలుగు తుంది. కారణమేమంటే హిందు సాంప్రదాయ ప్రకారం స్వామిజీల వ్యాఖ్యలను నమ్ము కుంటారు. ఈ నేపధ్యంలో స్వామిజీ వ్యాఖ్యలు నిజమైతే కేశినేని పరిస్దితి ఏంటి అని కొం దరు అంటున్నారు.

వాస్తవంగా బుద్దా వెంకన్న అతి చేయటం వెనుక ఆయనస్వార్దం ఉందని,గోశాల దగ్గర ఆయన నివాస గృహం ఉండటం, ఇరుకుగా ఉన్నవన్నీ తీసివేస్తే ఆయనకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే తలంపుతో వెంకన్న హడావుడి చేశాడని కొందరు అంటున్నారు. గతంలో ఎంపి కేశినేని నాని కూడా రాజకీయపరంగా ఎన్నో సంచలనపరమైన వ్యాఖ్యలు చేసి చంద్రబాబుదగ్గర చివాట్లుతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎంపి టిక్కెట్ ఆశించి తనకు దక్కదు అనే తలంపుతో కొందరి నాయకులపై బహిరంగంగానే విమ ర్శలు చేశారు. అప్పట్లో నాని అందరి దృష్టిలో పడ్డారు.తరువాత కొన్ని పత్రికల వారితో కూడా వివాదాలు పెట్టుకున్న సందర్బాలు ఉన్నాయి.

కాని మానవు లతో వివాదాలు సహజం. కానీ దైవంతో పెట్టుకుంటే మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదని కొందరు అంటున్నారు. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ సీటు విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. దీనిని బిజెపి కేటాయిస్తారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.ఒకవేళ తెలుగు దేశానికి ఇచ్చిన అభ్యర్దిని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ స్వామిజీలు శాపనార్దాలు పెట్టటం వల్ల రానున్నకాలంలో ఎదొకటి నిజమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని కొంత మంది హిందువులు అంటున్నారు.

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు ఈ స్వామిజీల శాపనార్దాలు కేశినేని నానికి రాజకీయ భవిష్యత్తుకు ఎటు దారి తీస్తాయోనని కొందరు అంటున్నారు. వాస్తవంగా విజయవాడ దేవాలయాల కూల్చివేత విషయాలలో నగర మేయర్ గాని, లేదా జిల్లా మంత్రులు చూసుకుంటారు. కానీ నాని ఒక ఎంపి, బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ వీరిద్దరు ఎక్కువగా పూసుకునేసరికి మిగిలిన బెజవాడ నాయ కులు కూడా వీరిపై గుర్రు మంటున్నారు.