ఈసారి మహేష్ బర్త్ డే గిఫ్ట్ అదే!

మహేష్‌బాబు రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా చిత్రీకరణ ఈ నెల 29 నుంచి మొదలు కానుంది. ఆగస్టు 1 నుంచి మహేష్ సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. రకుల్ ప్రిత్ సింగ్ కథానాయిక. ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య, మహేష్‌కి తల్లిగా తమిళ నటి దీపా రామానుజం నటించబోతున్నారు.

మహేష్ ప్రతి పుట్టిన రోజుకీ ఆయన కొత్త సినిమాకి సంబంధించిన సందడి తప్పని సరిగా ఉంటుంది. ఈసారి కూడా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆగస్టు 9న ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. మహేష్‌ని దృష్టిలో ఉంచుకొని పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసుకొన్నారు. అందుకే ఇకపై ఆయన మరింత దూకుడు పెంచి పనిచేయ నున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

బ్రహ్మాత్సవం నిరాశ పరిచినా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడు మురుగదాస్ స్క్రిప్ట్‌ను పక్కా ప్రణళిక బద్దంగా తయారు చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు ఫస్ట్ టైమ్ తమిళ్ లో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పై అభిమానుల్లోను, పరిశ్రమలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఒక డిఫరెంట్ కథతో రూపుదిద్దుతున్న ఈచిత్రం సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.