అదే ప్రభాస్ కి పెద్ద టెన్షన్ నా

‘ఛత్రపతి’,’డార్లింగ్‌’, మిర్చి’ వంటి భారీ హిట్లు ప్రభాస్‌ కెరీర్‌లో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ సినిమా ఆయన కెరీర్‌కి సరిపడా పెద్ద హిట్‌ ఇచ్చేసింది. కేవలం టాలీవుడ్‌కే కాకుండా, ప్రపంచం మొత్తం పాపులర్‌ అయిపోయాడు ప్రభాస్‌ ‘బాహుబలి’తో. అయితే ఇంత క్రేజ్‌ సంపాదించేసుకున్న ప్రభాస్‌కి మరి తనకు నెక్స్ట్‌ కెరీర్‌ ఉందా? ఉంటే ఈ స్టార్‌ డమ్‌ని తట్టుకుని కెరీర్‌ని ఎలా ముందుకు నడిపించాలో తెలియక సతమతమవుతున్నాడట.

‘బాహుబలి’ పార్ట్‌ 1 వరకూ ప్రభాస్‌కి ఈ అనుమానం రాలేదు. కానీ పార్ట్‌ 1ని మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ పార్ట్‌ 2 షూటింగ్‌ చివరి దశకు చేరుకునే కొద్దీ, తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ విషయమై టెన్షన్‌ పట్టుకుందట ఈ ఆరడుగుల ఆజానుబాహుడికి. ఇప్పటికే కథలు వినడం స్టార్ట్‌ చేశాడు ప్రభాస్‌. తనకు సూటబుల్‌ అయ్యే విధంగా లవ్‌స్టోరీలు, థ్రిల్లర్‌ స్టోరీలు చాలానే ప్రభాస్‌ ముందుకొస్తున్నాయి. అయితే అవన్నీ ‘బాహుబలి’ సినిమాతో పోలికలు పెట్టుకుని తన ఫ్యూచర్‌ కెరీర్‌ మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో అని ఆలోచనలో పడ్డాడట ప్రభాస్‌.

బాహుబలిగా తనను చూసిన ప్రేక్షకులు ఇకపౖెె సాధారణ క్యారెక్టర్‌లో తనను ఎలా స్వీకరిస్తారా? అని ఫీలవుతున్నాడట. ఏది ఏమైనా ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత ‘డార్లింగ్‌’ లాంటి ఒక క్యూట్‌ రొమాంటిక్‌ స్టోరీనే ఎంచుకోవాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. తన తోటి నటీనటులు రానా, అనుష్క, తమన్నాలకు లేని ప్రోబ్లమ్‌ పాపం ప్రభాస్‌ని వెంటాడడం విచిత్రమే. ఆ సినిమాతో పాటు ఇతరత్రా సినిమాలు ఈ తారలు బాగానే చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రభాస్‌ ఒక్కడే ఈ గత మూడేళ్లుగా ఒకే ప్రాజెక్ట్‌లో స్టిక్‌ ఆన్‌ అయిపోయాడు.